నిఖిల్ కొత్త అవ‌తారం..

ఓక సినిమా కి డేట్స్ ఇవ్వ‌టం.. షూటింగ్ చేసి, డ‌బ్బింగ్ చెప్పెసాక‌.. ఓక‌టో రెండో ఇంట‌ర్యూలు.. ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ చేసేస్తే ప‌న‌యిపోతుంది అనుకుంటున్న చాలా మంది హీరోలు నిఖిల్ ని చూసి మారాలి. ఈరోజుల్లో సినిమా తీయ‌టం కంటే రిలీజ్ చేయ‌టం చాలా క‌ష్టం.. అంత‌కంటే ప్రేక్ష‌కుడికి సినిమా ని రీచ్ చేయ‌టం అనేది చాలా పెద్ద స‌మ‌స్య గా మారింది.. గ‌తంలో ఓక చిత్రం విడుద‌ల‌య్యాక మౌత్ టాక్ తో రెండ‌వ వారం, మూడ‌వ వారంలో స్ట‌డిగా వెళ్ళి 50 రోజులు.. 100 రోజులు ఆడేవి.. కాని సినిమా కాల‌మానం చాలా చిన్న‌ద‌య్యింది. తెలుగుసినిమా భ‌విష్య‌త్తు ఒక వీకెండ్ మాత్ర‌మే అంటే కేవ‌లం మూడు రోజులు అన్న‌మాట‌.. ఈ మూడు రోజులు ఎంత పిండుకునేవాడికి అంతే..

ప్రేక్ష‌కుడికి ఓక‌ప్పుడు సినిమానే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇప్ప‌డు సినిమా కూడా ఓక ఎంట‌ర్‌టైన్‌మెంట్ లో ఆప్ష‌న్ గా మారింది. ఇలాంటి టైంలో మెద‌టి రోజు మెద‌టి ఆట ఫుల్ చేసుకోక‌పోతే ఆ వీకెండ్ అంతా పోయిన‌ట్టే.. ఇదిలా వుంటే సినిమా చేసేసాము ప్ర‌మెష‌న్ నిర్మాత భాద్య‌త నాకెందుకు అనుకుంటున్నారు చాలా మంది హీరోలు. వీరంద‌రికి పూర్తి భిన్నం గా నిఖిల్ ఆలోచిస్తాడు.. తను చేసే చిత్రాల వ‌ల్ల అటు నిర్మాత‌లు, ఇటు డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎగ్జిబ్యూట‌ర్స్ ఎవ‌రూ న‌ష్ట‌పోకూడదు అనే మైండ్ సెట్ తో ప‌నిచేస్తాడు. గ‌తంలో ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడా, కేశవ‌, కిరాక్ పార్టి లాంటి చిత్రాల‌కి త‌న స్టైల్ లో ప్ర‌మెష‌న్ చేశాడు..

ఇప్ప‌డు తాజాగా త‌ను న‌టించిన అర్జున్ సుర‌వ‌రం చిత్రం మే 1న విడుద‌ల కానుంది. ఈ చిత్రం లో ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్ట్ గా నిఖిల్ న‌టిస్తున్నారు. అయితే కొత్త‌గా టివి 9 రిపోర్ట‌ర్ గా మారి త‌న సినిమా ని ప్ర‌మెట్ చేస్తున్నాడు. అంతే కాదు త్వ‌ర‌లో రీసెంట్ ఎల‌క్ష‌న్స్ లో అంద‌ర్ని యూట్యూబ్ లో ఎంట‌ర్‌టైన్ చేసిన ఓక లీడ‌ర్ ని ఇంట‌ర్వ్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాడు . ఇలా త‌ను త‌న సినిమాకి రిలేటెడ్ గా ప్ర‌మోట్ చేసి అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటున్నాడు.

Post Author: Cinemareels